Amalapuram: సీఐ ప్రశాంత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: కాలు లిగమెంట్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సీఐ ప్రశాంత్ కుమార్‌ను ఎమ్మెల్యే ఆనందరావు సమనసలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.
Amalapuram: సీఐ ప్రశాంత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: సి.ఐ ప్రశాంత్ కుమార్ త్వరగా కోలుకోవాలి ఎమ్మెల్యే ఆనందరావు ఆకాంక్షించారు. ఇటీవల కాలు లిగమెంట్ ఆపరేషన్ చేయించుకుని అమలాపురం మండలం సమనస గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సీఐ ప్రశాంత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు నేడు నేరుగా వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా సీఐ శస్త్రచికిత్స అనంతరం అందుతున్న వైద్యం,ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని,సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ విధుల్లో చేరాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో DCMS చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




