Amalapuram: అమలాపురంలో ఘనంగా 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం!
Amalapuram: అమలాపురాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత.. గడియార స్తంభం వద్ద స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.
Amalapuram: అమలాపురంలో ఘనంగా 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం!
Amalapuram: పరిశుభ్ర అమలాపురమే లక్ష్యంగా "స్వచ్ఛతా ప్రతిజ్ఞ" చేయించిన ఎమ్మెల్యే ఆనందరావు.ఈ రోజు అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (స్వచ్ఛతా హీ సేవా) కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు,స్థానిక ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు సమయం కేటాయిస్తానని,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అమలాపురం నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచుతానని ప్రతిఒక్కరితో ప్రమాణం చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూనాడుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టిన ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్నే నేడు దేశమంతా అమలు చేస్తున్నారని కొనియాడారు.స్వచ్ఛత అనేది ఒక కార్యక్రమం కాదు మన నిత్యజీవితంలో ఒక భాగం అని, ప్రజలందరూ భాగస్వాములై అమలాపురాన్ని స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




