Amalapuram: తూర్పులంకలో రూ.1 కోటితో బిటి రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

Amalapuram: 'పల్లె పండుగ 3.0'లో భాగంగా కోనసీమ జిల్లా తూర్పులంకలో రూ.1 కోటి వ్యయంతో 2 బిటి రోడ్ల నిర్మాణ పనులకు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు శంకుస్థాపన చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Oct 2026 3:55 PM IST
Amalapuram
X

Amalapuram: తూర్పులంకలో రూ.1 కోటితో బిటి రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

Amalapuram: కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ రహదారుల పునర్నిర్మాణం ఎమ్మెల్యే ఆనందరావు.ఈ రోజు గ్రామీణ ప్రాంతాల సమగ్ర స్వరూపాన్ని మార్చివేస్తూ, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా అల్లవరం మండలం, తూర్పులంక గ్రామంలో సుమారు రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న 2 బిటి (BT) రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆనందరావు ఈ రోజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విజనరీ నాయకత్వంలో రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు వేగంగా మారుతున్నాయని కొనియాడారు.గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారులు పూర్తిగా అధ్వానంగా తయారై ప్రయాణికులు నరకం చూశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'పల్లె పండుగ' ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేస్తూ పల్లెల్లో ప్రగతి విప్లవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

తూర్పులంక గ్రామంలో రూ.1 కోటి నిధులతో చేపట్టే ఈ 2 బిటి రోడ్ల నిర్మాణంతో ప్రజలకు,రైతులకు, వాహనదారులకు శాశ్వత రవాణా సౌకర్యం కలగనుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పనులను నిర్ణీత గడువులోగా, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి గ్రామాన్ని తారు రోడ్లు,సీసీ రోడ్లతో అనుసంధానించడమే మన కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM