Amalapuram: అమలాపురంలో ₹67 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Amalapuram: అమలాపురంలో 82 మంది లబ్ధిదారులకు ₹67 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ. నియోజకవర్గంలో ఇప్పటివరకు ₹8 కోట్లు అందించామని ఎమ్మెల్యే ఆనందరావు వెల్లడి.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 1:33 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ₹67 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Amalapuram: అమలాపురంలో 82 మంది లబ్ధిదారులకు రూ.67 లక్షల సీఎం సహాయ నిధి అందజేత నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 8 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

పేదల ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండంత అండగా ఉంటున్నారు ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. సంక్షేమం,అభివృద్ధే ధ్యేయంగా కూటమి సీఎం పాలన ఎమ్మెల్యే ఆనందరావు అని వ్యాఖ్యనిచ్చారు.

ఈ రోజు స్థానిక అమలాపురంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గంలో 82 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 67 లక్షల విలువైన CMRF చెక్కులను ఈ రోజు అందించడం జరిగిందని తెలిపారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారుగా రూ.8 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశామని పేర్కొన్నారు. అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆనందరావు అన్నారు.

పేదల ఆరోగ్యం,సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ,ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం చంద్రబాబు కొండంత అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో పేదరికం, అనారోగ్యం వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా కుంగిపోకూడదనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు,లబ్ధిదారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM