Rajahmundry: శ్యామలాంబ పాఠశాలకు నూతన భవనం!
Rajahmundry: రాజమండ్రి శ్యామలాంబ పాఠశాలకు రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నూతన భవన నిర్మాణం. పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: శ్యామలాంబ పాఠశాలకు నూతన భవనం!
Rajahmundry: నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగా శనివారం 11వ డివిజన్ విఎల్ పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన భవన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని, చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.
పాఠశాలల్లో అవసరమైన తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎస్‌ఆర్ నిధులను సమీకరిస్తూ ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. విద్యా సంస్థల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు, సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, వారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కంటిపూడి రాజేంద్రప్రసాద్, రాజా, భద్రరావు, జామి సత్యనారాయణ, విజయ జ్యోత్స్న, రామారావు, తోట కిరణ్, హేమలక్ష్మి, వెంకటేశ్వరరావు, వెంకన్న దొర, పిల్లి తాతారావు, మల్లికార్జున రావు, ఐ. శ్రీను, భవాని, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.




