Rajahmundry: 35వ డివిజన్‌లో రూ.3.04 కోట్లతో అభివృద్ధి!
Rajahmundry: రాజమండ్రి 35వ డివిజన్‌లో రూ. 3.04 కోట్లతో అభివృద్ధి పనులు. డోర్ టు డోర్ కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేసి వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: 35వ డివిజన్‌లో రూ.3.04 కోట్లతో అభివృద్ధి!
Rajahmundry: నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా 35వ డివిజన్ అభివృద్ధికి మొత్తం రూ.3.04 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా శనివారం 35వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే వాసు స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డివిజన్‌లో రూ.304.71 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 35వ డివిజన్‌లో ఇప్పటికే రూ.90.94 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.84 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.129.77 లక్షల విలువైన పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు తెలియజేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




