Nidadavole: కూటమి అభ్యర్థుల విజయంతోనే క్షేత్రస్థాయి అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: నిడదవోలు 22వ వార్డు కూటమి జనసేన అభ్యర్థి పుల్లేటికుర్తి వెంకటేష్ తరఫున ముమ్మర ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్.
Nidadavole: కూటమి అభ్యర్థుల విజయంతోనే క్షేత్రస్థాయి అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని 22వ వార్డులో కూటమి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుల్లేటికుర్తి వెంకటేష్ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి దుర్గేష్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపల్ ఛైర్ పర్సన్ కూటమి అభ్యర్థి మురాల జ్యోతి, వైస్ ఛైర్మన్ కొమ్మిన వెంకటేశ్వరరావుతో పాటు 32 వార్డుల్లో పోటీలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ప్రచారంలో భాగంగా 22వ వార్డులోని స్థానిక మసీదు వద్ద నమాజ్ పూర్తి చేసుకుని వస్తున్న ముస్లిం సోదరులను మంత్రి దుర్గేష్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. ప్రజా వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి దుర్గేష్ వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ..ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్లాటర్ హౌస్‌ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త స్లాటర్ హౌస్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పేద ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అవసరమైన ప్రాంతాల్లో షాదీఖానాల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో గడిచిన రెండేళ్ల కాలంలో నిడదవోలు పట్టణంలో మౌలిక వసతుల కల్పన ముమ్మరంగా సాగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిడదవోలులోని వందలాది మంది పేద కుటుంబాలకు కోట్లాది రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని గుర్తుచేశారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నిధుల కొరత లేకుండా వార్డులన్నీ వేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.కేవలం మాటలతో కాకుండా, స్పష్టమైన ప్రణాళికతో ప్రతి వార్డులో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, వీధిదీపాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి – నిడదవోలును మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వెల్లడించారు.




