Etapaka: కుక్కునూరులో భూసేకరణ పేరుతో మధ్యవర్తుల దందా
Etapaka: కుక్కునూరు మండలంలో భూసేకరణ పేరుతో ఎకరాకు కమీషన్ డిమాండ్ చేస్తూ రైతులను సంప్రదిస్తున్న దళారులపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు.
Etapaka: కుక్కునూరులో భూసేకరణ పేరుతో మధ్యవర్తుల దందా
కుక్కునూరు: ఎటపాక మండల గిరిజనులకు భూములు కేటాయించేందుకు కుక్కునూరు మండలంలో ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందంటూ కొందరు వ్యక్తులు రైతులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. తమ ద్వారా భూములు ఇస్తే ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం ఇప్పిస్తామని, అందులో రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తమకు ఇవ్వాలని కోరుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
భూసేకరణకు ఇంకా 100 ఎకరాల భూమి అవసరముందని, భూములు సేకరించాల్సిందిగా అధికారులే తమకు సూచించారని మధ్యవర్తులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కూడా సూచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.




