Medicherlapalem: చదువులో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కోవాలి: కౌన్సెలర్ ప్రసాద్!

Medicherlapalem: కోనసీమ జిల్లా మేడిచెర్లపాలెం జడ్పీ హైస్కూల్‌లో ప్రపంచ మానసిక ఆరోగ్య మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 22 Oct 2026 5:13 PM IST
Medicherlapalem
X

Medicherlapalem: చదువులో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కోవాలి: కౌన్సెలర్ ప్రసాద్!

మేడిచెర్లపాలెం: ప్రపంచ మానసిక ఆరోగ్య మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మేడిచెర్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఆరేటి త్రిమూర్తులు అధ్యక్షతన, డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ వి.వి.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువులో ఒత్తిడి, పరీక్షల భయం, ఆందోళన వంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ, అవసరమైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కౌన్సెలర్ల సహాయం తీసుకోవాలని తెలిపారు.

పోస్టర్ల ప్రదర్శన ద్వారా భావోద్వేగాల గుర్తింపు, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం, పరస్పర సహకారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, సమగ్ర వికాసానికి దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE