Konaseema: వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం!

Konaseema: కార్తిక మాసం శనివారం సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తగా, సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 14 Nov 2026 4:49 PM IST
Konaseema
X

Konaseema: వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం!

కోనసీమ: కోనసీమ తిరుమల గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏడు శనివారాల వెంకన్నకు శనివారం పోటెత్తిన భక్తులు. కార్తిక మాసం శనివారం కావడంతో ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తులు స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము మూడు గంటల నుండి క్యూలైన్లో వేచి ఉండి శిలా తోరణం వరకు భక్తులు దర్శనం కోసం వేసి ఉండటం కనిపించింది.

ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని జిల్లాలో భక్తులతో పాటు తెలంగాణ కర్ణాటక చెన్నై నుండి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తెల్లవారుజాము తొలత సుప్రభాత సేవ తొలి హారతి నుండి స్వామివారి దర్శనం జరుగుతుంది. 12 గంటల వరకు దర్శనం తర్వాత భక్తులు స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారికి ఒంటి గంట సమయంలో నైవేద్యం తర్వాత ఒక గంట విరామం ఉంటుంది.

అనంతరం యధావిధిగా సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి దర్శనం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా 80 వేల నుండి లక్ష పైబడి దర్శనాలు చేసుకున్నారని అధికారులు తెలుపుతున్నారు. ఆలయ అధికారులు దేవస్థానం పాలకవర్గం సంయుక్తంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తూ అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA