Amalapuram: ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

Amalapuram: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీలు సానా సతీష్, హరీష్ బాలయోగి సమక్షంలో టీడీపీలో చేరారు.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 12:15 PM IST
Amalapuram
X

Amalapuram: ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

Amalapuram: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ ఎమ్మెల్యే ఆనందరావు,ఎంపీలు సానా సతీష్,హరీష్ బాలయోగి సమక్షంలో టీడీపీలో భారీ చేరికల వెల్లువలా.కూటమి అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై నియోజకవర్గంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి అనీ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.

అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది.ఎస్.యానాం గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు,రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథుర్ ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ని వీడి టీడీపీలో చేరిన ఓలేటి వెంకటరమణ,లంకే వీరవెంకటసత్యనారాయణ, ఓలేటి శ్రీరామకృష్ణ,ఓలేటి వరప్రసాద్ లకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న సంక్షేమం,అభివృద్ధికే ప్రజలు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.

పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు,గౌరవం ఉంటుందని తెలిపారు.ఈ చేరికల కార్యక్రమంలో అముడా (AMUDA) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు,టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు,మాజీ జెడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ,నాయకులు

చిక్కాల గణేష్,లంకే భీమరాజు,అయితాబత్తుల రాజశేఖర్,పళ్లచోళ్ల బుజ్జి, దంగేటి చిట్టిబాబు,ఉలిశెట్టి దొరబాబు,చెరుకూరి రాంబాబు, మరియు కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో సంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM