Gondi: గొందిలో అంబేడ్కర్, మదర్ థెరీసా విగ్రహాల ముసుగు తొలగింపు!
Gondi: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో అంబేడ్కర్, మదర్ థెరీసా విగ్రహాల ముసుగు తొలగింపు. హెచ్‌ఎం టీవీ కథనానికి స్పందించిన ఎన్నికల అధికారులు.
Gondi: గొందిలో అంబేడ్కర్, మదర్ థెరీసా విగ్రహాల ముసుగు తొలగింపు!
గొంది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఏర్పాటు చేసిన ముసుగును అధికారులు తొలగించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా విగ్రహాలకు ముసుగులు ఏర్పాటు చేసే క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి సైతం ముసుగు వేశారు.
ఈ అంశంపై హెచ్‌ఎం టీవీ వెబ్‌లో వార్త ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. వెంటనే తగిన చర్యలు చేపట్టి అంబేడ్కర్ విగ్రహంతో పాటు గొప్ప మానవతావాది మదర్ థెరీసా విగ్రహానికి ముసుగును తొలగించారు.
ఎన్నికల నిబంధనల అమలుతో పాటు ప్రజల భావోద్వేగాలు, సామాజిక గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ అధికారులు స్పందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




