Maredumilli: వర్షంలోనూ సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి వాణిశ్రీ ప్రచారం!
Maredumilli: మారేడుమిల్లి జెడ్పీటీసీ సీపీఎం అభ్యర్థి మట్ల వాణిశ్రీ వర్షంలోనూ ముమ్మర ప్రచారం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆదివాసీలకు విజ్ఞప్తి.
Maredumilli: వర్షంలోనూ సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి వాణిశ్రీ ప్రచారం!
మారేడుమిల్లి: అర్నబ్ తుఫానుతో ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నా, మరొకవైపు సిపిఎం కార్యకర్తలు బుధవారం మారేడుమిల్లి మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జడ్పిటిసి అభ్యర్థి మట్ల.వాణిశ్రీ మాట్లాడుతూ మండలంలో నేటికీ రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడం విచారకరమని అన్నారు.
ఈ ప్రాంతం నుంచి ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం తప్ప, ప్రజల గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ప్రచారం నిమిత్తం పుర విధుల్లో తను తిరుగుతున్న సందర్భంలో అనేక చోట్ల ప్రజలు ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ఎన్నికల నాడు తప్ప, తమ ముఖం కూడా చూపించట్లేదని తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
కొందరు ప్రజాప్రతినిధులు కనీసం తమ స్వగ్రామాలకు కూడా రోడ్లు వేయించుకోలేకపోయారని అన్నారు. తను అనేక సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నానని, కార్మికులు కర్షకులు, కష్టజీవులు, మహిళలు, వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించటమే కాక అరెస్టులకు కూడా వెనుకాడ లేదని తెలిపారు.
ప్రశ్నించేటువంటి స్వభావం కలిగి ఉన్నానని తెలిపారు. తనను జడ్పిటిసిగా గెలిపిస్తే నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలోని జిల్లా పరిషత్ లో అణగారిన వర్గాల, ఆదివాసీల గొంతుకుగా ఉంటానని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, జిల్లా నాయకులు కంభం శాంతి రాజు, ఇ. సత్యనారాయణ రెడ్డి, మలి రెడ్డి, గంగి రెడ్డి, మల్లి ఖర్జున్ తదితరులు పాల్గొన్నారు.




