Mamidikuduru: రాజ్యాంగ దినోత్సవం రోజున ఓటేసిన జడ్పీ చైర్పర్సన్ అమూల్య!
Mamidikuduru: భారత రాజ్యాంగ దినోత్సవం రోజున మామిడికుదురు మండలం ఆదుర్రు పోలింగ్ కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గొల్లపల్లి అమూల్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Mamidikuduru: రాజ్యాంగ దినోత్సవం రోజున ఓటేసిన జడ్పీ చైర్పర్సన్ అమూల్య!
మామిడికుదురు: భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీన గ్రామపంచాయతీల తొలి విడత ఎన్నికలు జరగడం, అదే రోజున ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గొల్లపల్లి అమూల్య అన్నారు. మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలోని మోరి పొలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు.




