Malikipuram: ఎన్నికల వేళ పోలీసుల కవాతు.. గ్రామాల్లో భద్రతా భరోసా!
Malikipuram: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో మలికిపురం స్టేషన్ పరిధి గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్; శాంతిభద్రతలపై భరోసా.
Malikipuram: ఎన్నికల వేళ పోలీసుల కవాతు.. గ్రామాల్లో భద్రతా భరోసా!
మలికిపురం: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. కొత్తపేట డీఎస్పీ ఎస్. మురళీమోహన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
మలికిపురం, లక్కవరం, శంకరగుప్తం, బట్టేలంక, కేశనపల్లి, గూడపల్లి, గుబ్బలపాలెం, పల్లిపాలెం తదితర గ్రామాల్లో పోలీసుల కవాతు సాగింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రజల్లో భరోసా, అసాంఘిక శక్తుల్లో అప్రమత్తత కల్పించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజోలు సిఐ సురేష్ బాబు,మలికిపురం ఎస్సై ఎం. మోహన్ కుమార్, సఖినేటిపల్లి ఎస్సై హరికోటిశాస్త్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




