Razole: రాజోలులో తుఫాను బాధితులకు మలేషియా ఆంధ్ర సంఘం అండ!

Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు రెల్లిపేటలో ఆర్నాబ్ తుఫాను బాధిత 70 కుటుంబాలకు మలేషియా ఆంధ్ర సంఘం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.

PRABHU, RAZOLE
Published on: 10 Nov 2026 4:19 PM IST
Razole
X

Razole: రాజోలులో తుఫాను బాధితులకు మలేషియా ఆంధ్ర సంఘం అండ!

రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు లో ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలుస్తూ మలేషియా ఆంధ్ర సంఘం తన సేవా నిరతిని చాటుకుంది. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రాజోలు పట్టణంలోని రెల్లిపేటకు చెందిన సుమారు 70 కుటుంబాలకు సంఘం సభ్యులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బొలిశెట్టి శ్రీరామ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కరోనా సమయంలోనూ ప్రజలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించామని గుర్తుచేశారు.

అలాగే మలేషియాలో ఏజెంట్ల మోసాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులను భారతీయ రాయబార కార్యాలయ సహకారంతో స్వదేశానికి పంపించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశానికి దూరంగా ఉన్నప్పటికీ మాతృభూమిపై మమకారంతో ప్రజలకు సేవ చేయడమే తమ సంఘం లక్ష్యమని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బొలిశెట్టి శ్రీరామ్ పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE