Chintoor: బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: ఐటీడీఏ పీవో
Chintoor: చింతూరు డివిజన్‌లో దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు లైసెన్స్, అగ్నిమాపక రక్షణ తప్పనిసరి అని ఐటీడీఏ పీవో చిట్టపులి నరేంద్ర పడాల్ ఐఏఎస్ స్పష్టం చేశారు.
Chintoor: బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: ఐటీడీఏ పీవో
చింతూరు: దీపావళి పండుగ సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలో బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని ITDA ప్రాజెక్టు అధికారి చిట్టపులి నరేంద్ర పడాల్ IAS స్పష్టం చేశారు.
జనావాసాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హైటెన్షన్ విద్యుత్ తీగలకు దూరంగా, విశాలమైన బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లు తప్పనిసరి అని, అనుమతించిన పరిమితిలో మాత్రమే నిల్వ చేయాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డివిజన్, మండల స్థాయిల్లో 24 గంటల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.




