Razole: రాజోలులో నిరుపేద దివ్యాంగ విద్యార్థినికి ఎల్‌ఐసీ ఉద్యోగుల సాయం!

Razole: రాజోలులో నిరుపేద దివ్యాంగ విద్యార్థిని మట్టా మెర్సీకి రూ.20 వేల విలువైన ట్యాబ్ అందజేసిన ఎల్‌ఐసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు.

PRABHU, RAZOLE
Published on: 19 Oct 2026 3:16 PM IST
Razole
X

Razole: రాజోలులో నిరుపేద దివ్యాంగ విద్యార్థినికి ఎల్‌ఐసీ ఉద్యోగుల సాయం!

Razole: ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రాజోలు ఎల్‌ఐసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓ నిరుపేద దివ్యాంగ విద్యార్థినికి అండగా నిలిచింది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన మట్టా మెర్సీకి రూ.20 వేల విలువైన ఏసర్ కంపెనీ ట్యాబ్‌ను బహూకరించి, ఆమె పోటీ పరీక్షల సన్నద్ధతకు ప్రోత్సాహం అందించింది.

మెర్సీ బీకాం కంప్యూటర్స్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె చదువుకు అవసరమైన డిజిటల్ వనరులను అందించాలనే ఉద్దేశంతో ఈ ట్యాబ్‌ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాజోలు ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎం.ఎన్. స్వామి, ఎల్‌ఐసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ కె. శ్రీనిబాబు, అసోసియేషన్ సభ్యులు వై. సిద్ధార్థ కుమార్, బి. శంకర్, ఎ. వంశీ, కె. శ్రీనివాస్, వి. మహేష్‌తో పాటు ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE