Kunavaram: మూడు పార్టీల ఏకాభిప్రాయం.. కూటూరు సర్పంచ్‌గా నూప రాజు
Kunavaram: కూనవరం మండలం కూటూరు పంచాయతీలో టీడీపీ, వైసీపీ, సీపీఎం ఏకతాటిపైకి; సీపీఎం అభ్యర్థి నూప రాజు సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎంపిక, గ్రామస్తుల హర్షం.
Kunavaram: మూడు పార్టీల ఏకాభిప్రాయం.. కూటూరు సర్పంచ్‌గా నూప రాజు
కూనవరం: కూనవరం మండలం కూటూరు గ్రామ పంచాయతీలో అరుదైన రాజకీయ ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికలంటేనే పోటీ, విభేదాలు, విమర్శలు అనే సాధారణ పరిస్థితికి భిన్నంగా టీడీపీ, వైసీపీ, సీపీఎం.. మూడు ప్రధాన పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సీపీఎం అభ్యర్థి నూప రాజు ను సర్పంచిగా ఎంపిక చేస్తూ చరిత్ర సృష్టించాయి.
పదవుల కోసం కాదు, ప్రజల కోసం అనే నినాదంతో మూడు పార్టీల నాయకులు పరస్పర చర్చలు జరిపారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫలితంగా ఎన్నికల్లో పోటీ లేకుండా, వివాదం లేకుండా సర్పంచ్ ఎంపిక పూర్తయింది. ఇది కూటూరు పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల్లో హర్షాతిరేకాలను నింపింది.
ఈ ఐక్యత నిర్ణయంపై సీపీఎం పార్టీ మండల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. టీడీపీ, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేసింది.రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి రావడం ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. కూటూరు ఐక్యత ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.




