Amalapuram: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన కుంచే రమణారావు!
Amalapuram: అమలాపురంలో వైయస్సార్సీపీ సీనియర్ నేత కుంచే రమణారావు మీడియా సమావేశం. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన రమణారావు.
Amalapuram: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన కుంచే రమణారావు!
Amalapuram: రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత కుంచే రమణారావు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై కత్తులు,రాళ్లు,కర్రలతో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రమణారావు పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వెళుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “రౌడీయిజంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు!” ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలకు హింస పరిష్కారం కాదని, ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని రమణారావు అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే వారిని ప్రజలు ప్రశ్నిస్తారని పేర్కొంటూ,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రమణారావు డిమాండ్ చేశారు.




