Kothapeta: రావులపాలెం-పలివెల రోడ్డుకు రూ.20 కోట్లు: ఎమ్మెల్యే బండారు
Kothapeta: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో రావులపాలెం బ్రిడ్జి నుంచి పలివెల బ్రిడ్జి వరకు జాతీయ రహదారి మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి.
Kothapeta: రావులపాలెం-పలివెల రోడ్డుకు రూ.20 కోట్లు: ఎమ్మెల్యే బండారు
Kothapeta: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో రావులపాలెం బ్రిడ్జి నుంచి వెదిరేశ్వరం మీదుగా పలివెల బ్రిడ్జి వరకు జాతీయ రహదారి 9 కి.మీ ల పొడవునా పాడై దెబ్బతిన్న మట్టి రోడ్డుగా మారిపోయిన మెటల్ రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక మరమ్మత్తుల కింద రూ.20కోట్లు నిధులు మంజూరయ్యాయి.
జాతీయ రహదారి 216E లో 22.730 కి.మీ నుంచి 27.600 కి.మీ వరకూ రూ.10 కోట్లు, 27.600 కి.మీ నుంచి 31.710 కి.మీ వరకూ రూ.10 కోట్లు మొత్తం రూ.20 కోట్లు మంజూరు అయ్యాయి.
త్వరలోనే టెండర్లు పిలిచి మూడు నెలల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు, ఈ రహదారి అభివృద్ధితో వాహనదారుల సమస్యలు పరిష్కారం కానున్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వచ్చే సంవత్సరం ఈ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.




