Kothapeta: పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

Kothapeta: కొత్తపేటలో దివంగత టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 17 Sept 2026 6:22 AM IST
Kothapeta
X

Kothapeta: పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

కొత్తపేట: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.

కొత్తపేట మండలం చిన్న గుల పాలెం గ్రామానికి చెందిన దివంగత వాసంశెట్టి వెంకన్న కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబమని, వారిలో ఎవరికి ఆపద కలిగిన ఆదుకోవడానికి పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.

యువ నాయకులు,మంత్రి నారా లోకేష్ దూర దృష్టితో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కార్యకర్తల కుటుంబానికి అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. వాసంశెట్టి వెంకన్న మృతి పార్టీకి తీరనిలోటని, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA