Kothapeta: తాగునీటి కోసం రూ.12 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గంలో తాగునీటి అభివృద్ధికి రూ.11.80 కోట్లు మంజూరు. మెర్లపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు.
Kothapeta: తాగునీటి కోసం రూ.12 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం!
Kothapeta: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో త్రాగునీటి కోసం 11 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంక్ కు సత్యానందరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి జలధార పథకంతో సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 16 పనులకు 11 కోట్ల 80 లక్షల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలమూరు మండలంలో 322.35 లక్షలు, ఆత్రేయపురం మండలంలో 36.34 లక్షలు, కొత్తపేట మండలంలో 338.49 లక్షలు, రావులపాలెం మండలంలో 482.52 లక్షలు మంజూరయ్యాయనారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కలసి అమరజీవి జలధార పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఈరోజు అమరజీవి జలధార పథకం ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.




