Kothapeta: కొత్తపేటలో ఆర్నబ్ తుఫాను సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బండారు!
Kothapeta: కొత్తపేటలో 'అర్నాబ్' తుఫాన్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పడిన చెట్లను తొలగించి, రైతులకు అండగా ఉంటామన్నారు.
Kothapeta: కొత్తపేటలో ఆర్నబ్ తుఫాను సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బండారు!
Kothapeta: ఆర్నార్ తుఫాను వల్ల రాత్రి ఆంధ్ర రాష్ట్ర రహదారిపై పలివెల నుండి రాకుర్తివారి పాలెం వరకు భారీ వృక్షాలు నేలకొరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను నేతలను అప్రమత్తం చేసి కూలిన చెట్లు క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాత్రి సంభవించిన తుఫాను వల్ల తీవ్రంగా ఈ ప్రాంతం అంతా అతలాకుతలమైంది చాలా ప్రమాదకరమైన గాలులు వీచినప్పటికీ అదృష్టం కొద్దీ ఎటువంటి ప్రమాదాలు ప్రాణాష్టం జరగలేదు రైతాంగం పూర్తిగా నష్టపోయారు పూరి గుడిసెలు చిన్నచిన్న ఇళ్లల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలు నేలకురిగాయి విద్యుత్ స్తంభాలు కూలిపోయి వైర్లు తెగి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వాటిని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు సిబ్బంది పూర్తిగా సహాయక చర్యలలో నిమగ్నమయి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని
రైతాంగ విషయానికి వస్తే వరి అరటి ఉద్యాన శాఖ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని
ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన సమయంలో ప్రయాణికులకు మహిళలకు పిల్లలకు సహాయ చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం బిజెపి జనసేన కూటమినేతలను బండారు అభినందించారు




