Alamuru: పెనికేరులో రూ.47 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శ్రీకారం

Alamuru: ఆలమూరు మండలం పెనికేరులో రూ.47 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 4 Oct 2026 7:56 PM IST
Alamuru
X

Alamuru: పెనికేరులో రూ.47 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శ్రీకారం

Alamuru: కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు.

ఆదివారం ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేసి, పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఓఎన్జిసి సిఆర్సి సిధులు రూ.14 లక్షలతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, మండల ప్రజా పరిషత్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA