Kothapeta: కొమరాజులంకలో రూ.69 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శ్రీకారం!
Kothapeta: రావులపాలెం మండలం కొమరాజులంకలో రూ.69 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, పుష్కర రోడ్డు పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు.
Kothapeta: కొమరాజులంకలో రూ.69 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శ్రీకారం!
కొత్తపేట: కొమరాజులంకలో రూ.69 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాలకు విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
రావులపాలెం మండలం కొమరాజులంకలో రూ.36 లక్షల పంచాయతీరాజ్ 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ వైద్య సేవలు మెరుగుదలకు హెల్త్ క్లినిక్ ల నిర్మాణం దోహదం చేస్తుందన్నారు.
అనంతరం రూ.33 లక్షల పుష్కర నిధులతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ నిర్వహించారు. 2027 పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.




