Kothapeta: జీఎంసీ బాలయోగి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బండారు నివాళి

Kothapeta: కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో జీఎంసీ బాలయోగి 75వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 1 Oct 2026 7:37 PM IST
Kothapeta
X

Kothapeta: జీఎంసీ బాలయోగి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బండారు నివాళి

కొత్తపేట: కోనసీమ ముద్దుబిడ్డ గంటి మోహనచంద్ర బాలయోగి రాష్ట్ర, దేశ రాజకీయాలపై వేసిన ముద్ర చెరగలేనిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో బాలయోగి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విలువలతో కూడిన రాజకీయాలతో దేశమంతా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి బాలయోగి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. బాలయోగి నడవడిక, ప్రవర్తన, ఆయన చేసిన అభివృద్ధి గురించి నేటికీ గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు.

బాలయోగి స్పీకర్ గా ఉన్న సమయంలో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయే స్థితిలో సైతం బాలయోగి గిరిధర్ గమాంగ్ ఓటు విషయంలో ఆయన విజ్ఞతకే వదిలివేసి విలువలు పాటించారని, తన ప్రభుత్వం పడిపోయిన బాలయోగి విలువలకు పట్టం కట్టారని వాజపేయి ప్రశంసించారని గుర్తు చేశారు. మనుషులు శాశ్వతం కాదని వారి వ్యక్తిత్వం నడవడిక వారు చేసిన అభివృద్ధి శాశ్వతం అని బాలయోగి నిరూపించారని ఎమ్మెల్యే కొనియాడారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA