Kothapeta: కొత్తపేటలో రూ.62.44 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Kothapeta: కొత్తపేటలో 125 మంది లబ్ధిదారులకు రూ.62,44,112 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు.
Kothapeta: కొత్తపేటలో రూ.62.44 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Kothapeta: కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న అభిమానానికి నిదర్శనంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెక్కులను అందజేశారు.
ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొనియాడారు. మన నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో సహాయ నిధి చెక్కులను ముఖ్యమంత్రి అందిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి బిల్లులను బట్టి ఎంతవరకు సహాయం అందజేయాలో అంతవరకు సహాయం అందజేస్తున్నారన్నారు.
వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడ్డ పేద కుటుంబాలను ఆదుకోవాలని సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయం అందిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన నియోజకవర్గంలో ఇప్పటికే 40 దఫాలుగా రూ.12,43,63,630ల విలువైన చెక్కులను 1958 మందికి అందజేశామన్నారు.
వైసిపి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి సహాయనిధి అనేది పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని, తమకు కావలసిన వారికి మాత్రమే ఒకరో,ఇద్దరికో దక్కేదని విమర్శించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఇంత పెద్ద మొత్తంలో సహాయం ఏనాడూ అందలేదన్నారు.
ఇంకా పెండింగ్లో ఉన్న చెక్కులను సైతం త్వరలోనే మంజూరు అయ్యేలా మాట్లాడడం జరిగిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నియోజకవర్గంలో పేదలకు సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో భాగంగా ఆత్రేయపురం మండలానికి చెందిన 25మందికి రూ.9,99,982లు, రావులపాలెం మండలానికి చెందిన 40మందికి రూ.2,137,358లు, కొత్తపేట మండలానికి చెందిన 37మందికి రూ.16,62,025లు, ఆలమూరు మండలానికి
చెందిన 23 మందికి రూ.14,44,747లు మొత్తం 125 మందికి రూ.62,44,112ల విలువైన చెక్కులను అందజేశారు. మొత్తం 125 చెక్కుల్లో 123 రీయింబర్స్మెంట్ కాగా ఎల్వోసీలు 2 ఉన్నాయి.




