Kothapeta: గోపాలపురంలో ఎన్నికల వేడి.. కూటమి అభ్యర్థిగా నాగు సుభాషిని

Kothapeta: రాజకీయాల పురిటిగడ్డ గోపాలపురం పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అధికార నాగు సుభాషిని రంగంలోకి దిగడంతో పోటీ నువ్వా-నేనా అన్నట్లు మారింది.

TRIMURTULU, KOTHAPETA
Published on: 16 Oct 2026 6:18 PM IST
Kothapeta
X

Kothapeta: గోపాలపురంలో ఎన్నికల వేడి.. కూటమి అభ్యర్థిగా నాగు సుభాషిని

Kothapeta: ఈ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం అంటే రాజకీయాల పురిటి గడ్డ గోపాలపురం గ్రామం నుండే ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొత్తపేట సమితి అధ్యక్షుడిగా రావులపాలెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సెంట్రల్ బ్యాంక్ రెండుసార్లు డైరెక్టర్గా ఉన్న ఘనత గోపాలపురం ఇక్కడ ఎన్నికలంటే జిల్లాలోనే కాదు కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నికల వేడి పుట్టిస్తుంది.

కొత్తపేట నియోజకవర్గంలో గోపాలపురం పంచాయతీ కూటమి అభ్యర్థి తెలుగుదేశం అధికార నాగు సుభాషిని మహిళా అభ్యర్థి ని పార్టీ ఎంపిక చేసింది ఇక్కడ ఎన్నిక నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఏ పార్టీకి నల్లేరు మీద నడక కాదు.

గోపాలపురం రాజకీయం అంటే చెప్పలేని విధంగా చివరిదాకా ఎటు తేల్చలేదు అన్నట్టు ఉంటుంది. కూటమి అభ్యర్థి భర్త అధికార నాగు గోపాలపురంలో గతంలో గోపాలపురం పంచాయతీ ఎన్నికలను ఉప సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉంది అయితే పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా పది సంవత్సరాలు పాటు గోపాలపురం ప్రజలకు సేవ చేస్తూ ఉండటం నాగు ప్రత్యేకత.

ఆయన భార్య అభ్యర్థి అయినప్పటికీ తనే నిలబడినట్టు భావించాలని ఇప్పటి నుండే తాను చేసిన పనులు గుర్తించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అధికార నాగు దళిత బలహీన వర్గాలు తో కలసి వారు ఏమి కోరిన పనులు చేయటం అధికార నాగు కు అలవాటు అదే ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థి సుభాషిని కి వరంగా మారింది. వీటన్నిటికీ తోడు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, గోపాలపురం సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణ, జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, మరొక నాయకుడు మై గోపుల గురవనాయుడు కలసి అధికార నాగు సుభాషినికి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA