Kothapeta: కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా యువనేత యల్లమెల్లి సందీప్!
Kothapeta: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తపేట గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ యువనేత యల్లమెల్లి సందీప్‌కు అవకాశం దక్కడంతో 40 ఏళ్ల కల సాకారమైంది.
Kothapeta: కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా యువనేత యల్లమెల్లి సందీప్!
కొత్తపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడింది. బీసీ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన యల్లమెల్లి సత్యనారాయణ గారి కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు యల్లమెల్లి జగన్మోహన్ గారి తనయుడు యువనేత యల్లమెల్లి సందీప్‌కు కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఎమ్మెల్యే బండారు కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి యల్లమెల్లి కుటుంబం విశేషంగా కృషి చేస్తోంది. ఈ సుదీర్ఘ రాజకీయ అనుబంధం, పార్టీ పట్ల అంకితభావం, కుటుంబ సేవలను గుర్తించి యల్లమెల్లి సందీప్‌కు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నమ్మకానికి, అనుబంధానికి తగిన గుర్తింపు లభించిందని పేర్కొంటూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి, బండారు శ్రీనివాస్ గారికి, కూటమి పెద్దలకు, నాయకులకు యల్లమెల్లి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువనేత సందీప్ నాయకత్వంలో కొత్తపేట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.




