Kothapeta: కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థి సందీప్ ప్రచారానికి ఆదరణ!

Kothapeta: కొత్తపేట గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి యల్లమెల్లి సందీప్ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఏనుగుమహల్‌లో వంకాయ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 25 Nov 2026 2:05 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థి సందీప్ ప్రచారానికి ఆదరణ!

కొత్తపేట: కొత్తపేట గ్రామం ఏనుగుమహల్ లో ఈ రోజు యల్లమెల్లి సందీప్ కు మద్దతుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రచారంలో అడుగుడుగునా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ , యువకులు , పెద్దలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా వంకాయ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఎన్నికల్లో తమ మద్దతు, నిర్ణయాన్ని తెలియజేశారు. గ్రామాల్లోని ప్రతి సమస్యని తెలుసుకుంటూ తాను విజయం సాధించిన వెంటనే సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తానని తెలియజేస్తూ ప్రచారంలో యల్లమెల్లి సందీప్ ముందుకు సాగుతున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA