Konaseema: విద్యుత్ ఉపకరణాలను పగటిపూటే వాడండి: ఈఈ రాంబాబు పిలుపు!

Konaseema: విద్యుత్ వ్యవస్థపై అధిక ఒత్తిడి తగ్గించేందుకు భారీ విద్యుత్ ఉపకరణాలను పగటిపూట మాత్రమే వినియోగించాలని కొత్తపేట విద్యుత్ శాఖ ఈఈ రాంబాబు కోనసీమ జిల్లా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 16 Sept 2026 8:37 PM IST
Konaseema
X

Konaseema: విద్యుత్ ఉపకరణాలను పగటిపూటే వాడండి: ఈఈ రాంబాబు పిలుపు!

కోనసీమ: విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తగినంత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ వ్యవస్థపై అధిక ఒత్తిడి ఏర్పడుతోంది.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు విద్యుత్ శాఖ కొత్తపేట.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.ప్రస్తుత విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తగినంత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ వ్యవస్థపై అధిక ఒత్తిడి ఏర్పడుతోంది.

ఈ పరిస్థితిని వినియోగదారులు అర్థం చేసుకుని, విద్యుత్ వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విద్యుత్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది. వినియోగదారులు సాయంత్రం మరియు రాత్రి వేళల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలను వీలైనంత వరకు పగటి సమయంలో,ముఖ్యంగా సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే వేళల్లో వినియోగించాలి.

వాషింగ్ మెషీన్లు,ఇస్త్రీ పెట్టెలు, నీటి మోటార్లు,విద్యుత్ వాహనాల ఛార్జింగ్,మిక్సీలు మరియు గ్రైండర్లు మొదలైన విద్యుత్ ఉపకరణాలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య వినియోగించడానికి ప్రాధాన్యత ఇచ్చి వినియోగదారులు సహకరించాలని కోరడమైనది కొత్తపల్లి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,కొత్తపేట ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM