Razole: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరపాలి: డీఎస్పీ మురళీమోహన్!
Razole: రాజోలులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ పరిశీలించారు. స్థానిక ఎన్నికల వేళ రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (
Razole: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరపాలి: డీఎస్పీ మురళీమోహన్!
Razole: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ సిబ్బందితో కలిసి రాజోలు నియోజకవర్గంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం రాజోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గత 15 రోజులుగా ఎన్నికల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై నివేదికలు రూపొందించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా చర్యలు చేపడతామన్నారు. పగలు, రాత్రి ప్రత్యేక తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని వెల్లడించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచి, అవసరమైన వారికి చట్టప్రకారం బైండోవర్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో రాజోలు సీఐ సురేష్బాబు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.




