Kothapeta: కొత్తపేట చింతామణి గణపతికి వందేళ్ల చరిత్ర: ఎమ్మెల్యే బండారు

Kothapeta: కొత్తపేట చింతామణి గణపతి వేడుకలకు వందేళ్ల ఘన చరిత్ర ఉందని, రూ.20 లక్షలతో నవరాత్రులు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 17 Sept 2026 4:54 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేట చింతామణి గణపతికి వందేళ్ల చరిత్ర: ఎమ్మెల్యే బండారు

కొత్తపేట: గణపతి నవరాత్రులు ప్రజల ఐక్యతకు ప్రతీకని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. వందేళ్ళ క్రితం ప్రారంభమైన కొత్తపేట చింతామణి గణపతి నవరాత్రి వేడుకలు నేటికీ వైభవంగా కొనసాగుతూ ఉండడం అభినందనీయమన్నారు.

బుధవారం చింతామణి గణపతి నవరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

గణపతి నవరాత్రి వేడుకలతో పాటుగా కరోనా సమయంలో సైతం భక్తి విశ్వాసాలతో వేడుకలను నిర్వహించారని, దాతలు అందిస్తున్న ప్రతి రూపాయిని సద్వినియోగం చేయడం ద్వారా కార్యక్రమ నిర్వాహకులు స్వామివారి పట్ల తమకున్న భక్తిని చాటుకుంటున్నారని కొనియాడారు. నిర్వాహకులను అభినందించారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA