Koonavaram: కూనవరంలో సీపీఎం–వైసీపీ పొత్తు ఖరారు

Koonavaram: కూనవరం మండలంలో సీపీఎం–వైసీపీ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైంది. జడ్పీటీసీని వైసీపీకి కేటాయించగా, ఎంపీటీసీ స్థానాల్లో 4–4 చొప్పున పంచుకున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 19 Oct 2026 5:37 PM IST
Koonavaram
X

Koonavaram: కూనవరంలో సీపీఎం–వైసీపీ పొత్తు ఖరారు

కూనవరం: కూనవరం మండలంలో సీపీఎం,వైసీపీ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖరారైంది.పొత్తులో భాగంగా జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కి కేటాయించడం జరిగింది. ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీ సాధిస్తే ఎంపీపీ పదవిని సిపిఎం కు ఇచ్చే విధంగా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

అలాగే వైస్ ఎంపీపీ,కో ఆప్షన్ పదవులను ఇచ్చే విధంగా ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు అయింది. మండలంలోని ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ నాలుగు స్థానాల్లో, సీపీఎం నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

ఇరు పార్టీల మధ్య కుదిరిన ఈ పొత్తుతో కూనవరం మండలంలో ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల సర్దుబాటు ఖరారైంది.సిపిఎం వైఎస్ఆర్సిపి మధ్య పొత్తు కుదరడంతో కూనవరం మండలంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం తధ్యమని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR