Konasema: తుఫాన్ బాధితుల రేషన్ కిట్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి!

Konasema: కోనసీమ జిల్లాలో అర్నబ్ తుఫాన్ బాధితులకు రేషన్ కిట్ల పంపిణీ పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ అధికారులకు విజ్ఞప్తి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 11 Nov 2026 12:40 PM IST
Konasema
X

Konasema: తుఫాన్ బాధితుల రేషన్ కిట్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి!

Konasema: కోనసీమ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లాలో అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాన్ బాధితులకు అందిస్తున్న రేషన్, నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ జిల్లా అధికారులను కోరారు.

జిల్లాలో తుఫాన్ బాధితులుగా గుర్తించిన అర్హులైన కుటుంబాలు ఎంతమంది? గ్రామాలు, వార్డుల వారీగా ఎంతమందికి రేషన్ కిట్లు అందిస్తున్నారు? ఒక్కో కుటుంబానికి ఏయే నిత్యావసర సరుకులు ఎంత పరిమాణంలో పంపిణీ చేస్తున్నారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం ఎంతమేరకు సరుకులు కేటాయించారు? ఇప్పటివరకు ఎంతమందికి పంపిణీ చేశారు? ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది? అనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.

ప్రస్తుతం రేషన్ కిట్ల పంపిణీపై ప్రజల్లో అనేక అపోహలు, సందేహాలు నెలకొన్నాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గ్రామాలు, వార్డుల వారీగా లబ్ధిదారుల వివరాలు, సరుకుల నిల్వలు, పంపిణీ పురోగతిని బహిరంగంగా వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ప్రభుత్వ సహాయం అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి చేరుతుందని జక్కంపూడి కిరణ్ పేర్కొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA