Razole: కోనసీమ జలమయం, రాజోలులో మునిగిన పంటలు

Razole: మురసు తుఫాన్ ప్రభావంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కుండపోత వర్షం. రాజోలు బస్టాండ్, ప్రభుత్వాసుపత్రి జలదిగ్బంధం. వరి చేలు, కొబ్బరి తోటలు నీటమునక.

PRABHU, RAZOLE
Published on: 4 Nov 2026 4:19 PM IST
Razole
X

Razole: కోనసీమ జలమయం, రాజోలులో మునిగిన పంటలు

రాజోలు: మురసు తుఫాను ప్రభావంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది.

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, వరి చేలు నీట మునిగాయి. రాజోలులో ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ప్రభుత్వాసుపత్రిలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరింది.

పంట కాలువల్లో నీటిమట్టం పెరగడంతో వరద నీరు సమీప వీధుల్లోకి ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE