Razole: కుండపోత వర్షంలోనూ వీఆర్ఏల పోరాటం!

Razole: కోనసీమ: రాజోలులో కుండపోత వర్షంలోనూ 9వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం; డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ.

PRABHU, RAZOLE
Published on: 24 Sept 2026 12:34 PM IST
Razole
X

Razole: కుండపోత వర్షంలోనూ వీఆర్ఏల పోరాటం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 9వ రోజుకు చేరుకుంది. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టెంట్ ఏర్పాటు చేసుకుని తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీ వీఆర్ఏలను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

వర్షం కురిసినా.. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని వీఆర్ఏలు స్పష్టం చేశారు. అధికారులు తక్షణమే చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE