Vadapalli: వాడపల్లి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.91 కోట్లు!
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 49 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.2,91,06,115 సమకూరింది. 39.5 గ్రాముల బంగారం, 1.607 కిలోల వెండి లభించాయి.
Vadapalli: వాడపల్లి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.91 కోట్లు!
వాడపల్లి: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 49 రోజులలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.2,91,06,115 ఆదాయం సమకూరింది. ఇందులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా రూ.2,42,49,560 నగదు లభించగా, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.48,56,555 ఆదాయం వచ్చింది.
అలాగే 39 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 607 గ్రాముల వెండి లభించాయి. 16 దేశాలకు చెందిన 136 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీ లెక్కింపులో లభించాయి. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆధ్వర్యంలో, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు చింతపల్లి సత్యనారాయణ, తమ్మన సాయి ప్రసాద్, వి. సుందర శేషావతారం (అర్చకులు) పాల్గొన్నారు. పర్యవేక్షణాధికారులుగా కె. లక్ష్మీనారాయణ శెట్టి, ఎస్.టి.పి.టి. శ్రీనివాస్ (తనిఖీదారు, రాజమండ్రి), పి.వి.వి.ఎస్. కామేశ్వరరావు (ఈఓ గ్రేడ్-II, శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి దేవస్థానం, పలివెల) వ్యవహరించారు.
అలాగే అర్చకస్వాములు, వేదపండితులు, గ్రామస్థులు వై. వెంకన్న, వై. సుబ్బారావు, వై. వెంకటేశ్వరరావు, యెరుబండి రాజు, పత్రికా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవకులు, కరూర్ వైశ్య బ్యాంక్, రావులపాలెం మరియు కెనరా బ్యాంక్, రావులపాలెం సిబ్బంది, దేవస్థాన ఉద్యోగులు పాల్గొన్నారు.




