Konaseema: కోనసీమలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభం: ఎస్పీ
Konaseema: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల సేకరణను వేగవంతం చేసేందుకు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ మొబైల్ ఫోరెన్సిక్ వాన్‌ను ప్రారంభించారు.
Konaseema: కోనసీమలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభం: ఎస్పీ
కోనసీమ జిల్లా: జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల సేకరణను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాన్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,ఐపీఎస్ ప్రారంభించారు.
నేరస్థలానికి నేరుగా చేరుకుని అక్కడికక్కడే ఆధారాలను గుర్తించడం, డాక్యుమెంటేషన్ చేయడం, సేకరించడం,భద్రపరచడం, ప్రాథమికంగా పరిశీలించడం వంటి సేవలను అందించేలా ఈ వాహనం రూపొందించబడింది. నేరస్థల పరిరక్షణ,సాధారణ భౌతిక ఆధారాల సేకరణ, సాధారణ కంటికి కనిపించని ఆధారాలను గుర్తించేందుకు హై-ఇంటెన్సిటీ ఫోరెన్సిక్ లైట్ వంటి అధునాతన పరికరాలు ఇందులో ఉన్నాయి.
ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాన్‌లో రక్తం,వీర్యం వంటి జీవ ఆధారాల ప్రాథమిక పరీక్ష–సేకరణ కిట్లు,డీఎన్‌ఏ నమూనా సేకరణ కిట్, మాదకద్రవ్యాలు మరియు పేలుడు పదార్థాల స్క్రీనింగ్ కిట్లు,గన్‌షాట్ రెసిడ్యూ సేకరణ కిట్,బుల్లెట్ హోల్ పరిశీలన కిట్, ట్రేస్ ఎవిడెన్స్ కోసం స్టీరియో మైక్రోస్కోప్,డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా,బాడీ-వోర్న్ కెమెరా–జీపీఎస్,సీసీటీవీ/డాష్‌బోర్డ్ కెమెరా,వెయింగ్ బ్యాలెన్స్,మినీ రిఫ్రిజిరేటర్, ఎల్‌ఈడీ స్క్రీన్,పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్,బార్‌కోడ్ స్కానర్ -థర్మల్ ప్రింటర్, జనరేటర్ వంటి పరికరాలతో పాటు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కిట్,ఫోరెన్సిక్ ఇమేజర్, పెన్‌డ్రైవ్,మెమరీ కార్డులు, ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్,డిజిటల్ డివైస్‌ల అక్విజిషన్-ఇమేజింగ్-ట్రయాజ్ టూల్,ఫీల్డ్ ట్రయాజ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
అనుమానాస్పద అగ్ని/గ్యాస్ ఘటనల్లో గ్యాస్ గుర్తింపు, డిజిటల్ ఆధారాల సేకరణ-భద్రపరచడం వంటి సేవలు కూడా అందించగల ఈ వాన్ ద్వారా నేరస్థల స్పందన మరింత వేగవంతమై,శాస్త్రీయ ఆధారాల సేకరణ,ఆధారాల భద్రత,కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులకు మెరుగైన ఫోరెన్సిక్ సహకారం అందనుంది అని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ పుల్లారావు,డీసీఆర్‌బీ సీఐ రాజేష్, ఆర్‌ఐ బ్రహ్మానందం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




