Razole: రాజోలులో ఏడో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: రాజోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె ఏడో రోజుకు చేరిక; సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన సీపీఐ నేతలు.

PRABHU, RAZOLE
Published on: 22 Sept 2026 2:02 PM IST
Razole
X

Razole: రాజోలులో ఏడో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు కొనసాగిస్తున్న ఆందోళనకు వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, రాజోలు అడ్వకేట్ యాలంగి రమేష్, దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బత్తుల మురళి, చిలకపాటి శ్రీధర్ తదితరులు సమ్మె శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉల్లూరి రమణ, సోడదాసు సునీల్ రాజా, చాగంటి రాజకుమార్, కె. నాగేశ్వరరావు, కె. రామకృష్ణ, రాధ, సావిత్రి, చిట్టి రత్నం, లక్ష్మీ దుర్గతో పాటు రాజోలు మండలానికి చెందిన వీఆర్ఏలు పాల్గొన్నారు. సమ్మెను విజయవంతంగా కొనసాగించేందుకు వీఆర్ఏలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE