Razole: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు: రాజోలులో పూజలు
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు కోళ్లవారి వీధిలో కొలువుదీరిన కనకదుర్గమ్మకు స్థానిక మహిళలు మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు.
Razole: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు: రాజోలులో పూజలు
రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లోని కోళ్లవారి వీధిలో ఎస్వీకే యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించారు. మేళతాళాల నడుమ గ్రామంలోని వీధుల గుండా సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి మండపం వద్ద సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.




