Razole: అంతర్ కళాశాల ఫెన్సింగ్ పోటీల్లో రాజోలు విద్యార్థికి రజతం!

Razole: ఆదికవి నన్నయ వర్సిటీ అంతర్ కళాశాల ఫెన్సింగ్ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. జగదీష్ వర్మ రజత పతకం సాధించి అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపికయ్యారు.

PRABHU, RAZOLE
Published on: 21 Nov 2026 5:14 PM IST
Razole
X

Razole: అంతర్ కళాశాల ఫెన్సింగ్ పోటీల్లో రాజోలు విద్యార్థికి రజతం!

రాజోలు: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని భీమవరం ఆర్ఆర్‌డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 18, 2026న నిర్వహించిన అంతర్ కళాశాల ఫెన్సింగ్ పోటీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. జగదీష్ వర్మ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించారు.

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జగదీష్ వర్మ ఈ పోటీలలో రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4 నుంచి 12 వరకు జమ్మూ విశ్వవిద్యాలయంలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయ ఫెన్సింగ్ పోటీలకు ఆయన ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు విజేత విద్యార్థిని అభినందించారు. క్రీడారంగంలో విద్యార్థులు సాధిస్తున్న విజయాలు కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.

కంప్యూటర్స్ విభాగాధిపతి జి. వరప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి. మధుకుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ ఈవీవీఎస్ ప్రకాష్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు జగదీష్ వర్మను అభినందించి, రానున్న అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE