Razole: ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.

PRABHU, RAZOLE
Published on: 26 Nov 2026 10:42 AM IST
Razole
X

Razole: ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు!

రాజోలు: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి.

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. పోలింగ్‌కు సమయం పరిమితంగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE