Razole: రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లిలో ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నికలు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. విజేతలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభినందించారు.
Razole: రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లిలో ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నికలు!
రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను అధికారులు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశారు. తొలుత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ పాలకవర్గ సభ్యులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్యతో పాటు కూటమి ముఖ్య నాయకులు అభినందించారు.




