Razole: రాజోలు నియోజకవర్గంలో 285 ఎంపీటీసీ నామినేషన్లు!

Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో 63 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 285 నామినేషన్లు దాఖలయ్యాయి.

PRABHU, RAZOLE
Published on: 23 Oct 2026 10:41 PM IST
Razole
X

Razole: రాజోలు నియోజకవర్గంలో 285 ఎంపీటీసీ నామినేషన్లు!

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మూడు మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 63 స్థానాలకు 285 నామినేషన్లు దాఖలయ్యాయి.

రాజోలు మండలంలో 20 స్థానాలకు 85, మలికిపురంలో 22 స్థానాలకు 96, సఖినేటిపల్లిలో 21 స్థానాలకు 104 నామినేషన్లు నమోదయ్యాయి. అత్యధికంగా సఖినేటిపల్లి మండలంలో నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. దీంతో మూడు మండలాల్లోనూ ఎన్నికల సందడి పెరిగింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE