Razole: రాజోలులో 23వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: కోనసీమ జిల్లా రాజోలులో వీఆర్ఏల 23వ రోజు సహాయ నిరాకరణ సమ్మెకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి సంఘీభావం తెలిపి, ఆర్థిక సహాయం అందజేశారు.

PRABHU, RAZOLE
Published on: 8 Oct 2026 7:06 PM IST
Razole
X

Razole: రాజోలులో 23వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. రాజోలు మండల వీఆర్ఏ సంఘానికి ఆర్థిక సహాయం అందించి తన మద్దతును తెలియజేశారు.

వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం 23 రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్న వీఆర్ఏలకు ఆయన మద్దతు ప్రకటించడం పట్ల సంఘం నాయకులు,సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE