P Gannavaram: పి.గన్నవరం మండలంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రచారం!

P Gannavaram: పి.గన్నవరం మండలంలోని నాలుగు గ్రామాల్లో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విస్తృత ప్రచారం.

RAJU, P GANNAVARAM
Published on: 31 Oct 2026 3:51 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరం మండలంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రచారం!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలంలోని నరేంద్రపురం, రాజులపాలెం, ఉడిమూడి-2, బెల్లంపూడి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి, కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM