Konaseema: మాగం గ్రామంలో కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ

Konaseema: మాగం గ్రామంలో కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. దళితుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడతామని వెల్లడించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 10:12 PM IST
Konaseema
X

Konaseema: మాగం గ్రామంలో కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం మాగం గ్రామంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివాజీ నివాసానికి చేరుకున్న మందకృష్ణ ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం శివాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తమ మధ్య కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దళితుల అస్తిత్వం,ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

విడివిడిగా ఉన్నప్పటికీ దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఐక్యంగా పోరాడతామని తెలిపారు. దళితులపై దాడులు,వివక్ష కొనసాగుతున్నాయని,బాబాసాహెబ్ అంబేద్కర్,మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కారెం శివాజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులను ఐక్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో దళితుల హక్కులు, రిజర్వేషన్లను పదేపదే పొడిగించే విధానానికి బదులుగా శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేలా మందకృష్ణ మాదిగతో కలిసి పోరాడుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM