Mamidikuduru: మామిడికుదురు జెడ్పీటీసీకి కూటమి 3 పార్టీల నామినేషన్లు!

Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు జెడ్పీటీసీ స్థానానికి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 23 Oct 2026 9:19 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురు జెడ్పీటీసీకి కూటమి 3 పార్టీల నామినేషన్లు!

మామిడికుదురు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

జనసేన తరఫున నగరం ఏఎంసీ చైర్మన్ పెనుమాల లక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు పార్టీ ఇంచార్జి గొల్లపల్లి అమూల్య, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ కుమార్తె కృష్ణ శ్రీవల్లి శుక్రవారం నామినేషన్లు సమర్పించారు.

ఒకే జడ్పీటీసీ స్థానానికి కూటమిలోని మూడు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా వెలువడే వరకు ఈ స్థానంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE